ICC: రెండంచెల టెస్టు విధానంపై ఐసీసీ దృష్టి 1 d ago
టెస్టు క్రికెట్ లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లతో కలిపి రెండంచెల విధానం ఏర్పాటు అవకాశాల్ని ఐసీసీ పరిశీలిస్తోంది. ఈ మేరకు బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో ఐసీసీ చర్చించనుంది. ఇందుకోసం సీఏ ఛైర్మన్ మైక్ బైర్డ్, ఈసీబీ అధ్యక్షుడు రిచర్డ్ థాంప్సన్ తో ఐసీసీ ఛైర్మన్ జై షా భేటీ కానున్నాడు. రెండంచెల విధానం ప్రకారం మూడు అగ్రశ్రేణి జట్లు తరచుగా టెస్టు మ్యాచ్లు ఆడతాయి. ఐసీసీ, బీసీసీఐ, సీఏ, ఈసీబీ ఒక్కతాటిపైకి వస్తే 2027లో ఈ కొత్త విధానం అమల్లోకి రావొచ్చు. ప్రస్తుతం ఈనెల 12న ముంబయిలో జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎసీఎం) పై బీసీసీఐ దృష్టిసారించింది. ఈ ఎసీఎంలో తాత్కాలిక కార్యదర్శి దేవజిత్ సైకియాకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించనుంది.